: నన్ను అవహేళన చేశారు: జయసుధ


తనను చాలా అవహేళన చేశారని సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తనను అవహేళన చేయడంపై కోపం కట్టలు తెంచుకున్నా, అవతలి వ్యక్తులపై స్పందించాల్సి రావడం తన స్థాయికి తగినది కాదని ఆగిపోయానని చెప్పారు. అవతలి వారు ఏదో అన్నారని, తాను కూడా ఏదో అనలేనని, అందుకే తాను టీవీలకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారని, కొందరు మా అధ్యక్షపదవి అవసరమా? అని కూడా ప్రశ్నించారని ఆమె తెలిపారు. అయితే, కొందరు అభిమానులు... వాళ్లకి కౌంటర్ ఇస్తే, ఇంకోటి అంటారని, అలాంటి వాటికి అవకాశం ఇవ్వవద్దని సూచించారని ఆమె చెప్పారు. తన స్థాయికి తగని వారు తనను ఎగతాళి చేసినప్పుడు కోపం వచ్చిందని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News