: వెన్నుపోటు పొడవొచ్చు అనుకుంటే కుదరదు... బాబును ఉద్దేశించి జగన్ పరోక్ష వ్యాఖ్యలు
ఈ కంప్యూటర్ యుగంలో అన్ని విషయాలూ అందరికీ తెలిసిపోతున్నాయని... ఎల్లవేళలా మోసం చేయచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, వెన్నుపోటు పొడవొచ్చు అనుకుంటే ఇక కుదరదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు బడ్జెట్ మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. లెక్కల్లో తేడాలు చూపిస్తూ రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నారని జగన్ విమర్శించారు. సీఎం తన కార్యాలయంలో ఏం చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిపోతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా గ్రూపుల మహిళలు తాము తీసుకున్న రుణాలపై 18 శాతం వడ్డీ కట్టుకోవాల్సి వస్తోందని అన్నారు. కాగా, బడ్జెట్ పై జగన్ మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు సభలో లేరు.