: తుళ్లూరులో టీడీపీ ఆవిర్భావ వేడుకలు... రేపు ఢిల్లీ నుంచి తిరుపతికి చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తుళ్లూరుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరింత ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను తుళ్లూరు మండలం అనంతవరంలో జరిపించిన ఆయన, టీడీపీ ఆవిర్భావ వేడుకలను కూడా తుళ్లూరులోనే నిర్వహించాలని నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు రేపు ఉదయం అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకుంటారు. ఎల్లుండి తిరుపతి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమకు బయలుదేరనున్న ఆయన అక్కడ పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తుళ్లూరు చేరుకుని పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకుంటారు.