: నీ సినిమాలు కూడా అన్నీ బ్లాక్ బ్లస్టర్స్ కదా... రాంగోపాల్ వర్మకు ఒమర్ అబ్దుల్లా కౌంటర్
నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ పోరులో ఇండియా ఓటమి తరువాత తనకు సంతోషంగా ఉందంటూ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 'అన్ని వేళలా నీ సినిమాలు కూడా అలాగే బ్లాక్ బ్లస్టర్ అవుతాయి కదా?' అంటూ వ్యంగ్య ట్వీట్ వదిలారు. ఆయన 'నో వండర్ యువర్ మూవీస్ ఆర్ సచ్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఆల్ ద టైమ్' అని ట్వీట్ చేశారు. ప్రపంచకప్ పోరులో భారత జట్టు బాగా ఆడిందని మెచ్చుకున్నారు. ఓటమిపై విపరీత వ్యాఖ్యలు చేస్తున్న వారిని, అతివాద చర్యలకు పాల్పడుతున్న వారిని అభిమానులు అనడం సరికాదని అభిప్రాయపడ్డారు.