: మరణశిక్ష ఖైదీకి రాష్ట్రపతి క్షమాభిక్ష
భార్య, కన్న పిల్లలను కిరాతకంగా హత్య చేసిన కేసులో ఓ మరణశిక్ష ఖైదీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు సదరు ఖైదీ పెట్టుకున్న అర్జీపై రాష్ట్రపతి సంతకం చేశారు. దాంతో అతని మరణశిక్ష జీవితఖైదుగా మారనుంది. అసోంలోని దిబ్రూగర్ ప్రాంతానికి చెందిన మన్ బహదూర్ దివాన్ అనే వ్యక్తి భార్య గౌరి, కుమారులు రాజీబ్, కాజీబ్ లను సెప్టెంబర్ 2002లో దారుణంగా అంతమొందించాడు. అంతకుముందు కూడా పొరుగింటి వ్యక్తిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన నేర చరిత్ర కూడా ఉంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకే రాష్ట్రపతి క్షమాభిక్ష నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.