: భూ సేకరణ సవరణ బిల్లుపై మోదీ బహిరంగ చర్చకు రావాలి: హజారే
విపక్షాలు, పలువురు సామాజిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్న భూ సేకరణ సవరణ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ చర్చకు రావాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఆయన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా స్వగ్రామం రాలేగాం సిద్ధిలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. అయితే గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఈ విషయంపై చర్చకు వస్తానని చెప్పారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆయనతో తాము మాట్లాడదల్చుకోలేదన్నారు. కేవలం ప్రధానితోనే చర్చిస్తామని అన్నా స్పష్టం చేశారు.