: టీ20 వరల్డ్ కప్ తరువాత రిటైర్మెంట్ పై ప్రకటన చేస్తా: ధోనీ
టీ20 వరల్డ్ కప్ తరువాత రిటైర్మెంట్ పై ప్రకటన చేస్తానని ధోనీ చెప్పాడు. ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం అనంతరం మీడియా సమావేశంలో ధోనీ మాట్లాడుతూ, టాపార్డర్ విఫలమైనప్పుడు లోయర్ ఆర్డర్ నుంచి అద్భుతాలు ఆశించలేమని అన్నాడు. ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిందని ధోనీ తెలిపాడు. టీమిండియాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని ధోనీ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు అభినందనలు తెలిపాడు. మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సెటైర్లు వేశాడు.