: కాంగ్రెస్ మళ్లీ కోలుకోలేదు... 'బిచారి' సోనియాను నిందించొద్దు: భరద్వాజ్
గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని... చరిత్రలో ఎన్నడూ లేనంత అవమానాన్ని ఎదుర్కొన్న జాతీయ కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత హన్సరాజ్ భరద్వాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మళ్లీ కోలుకోలేదన్నారు. "ప్రజలింక ఏమీ వినేందుకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకోలేదు" అని భరద్వాజ్ ఆంగ్ల వార్తా ఏజెన్సీ ఏఎన్ఐతో పేర్కొన్నారు. "ఈ విషయంలో నేను ఆ నిస్సహాయ మహిళ (సోనియాగాంధీ) (ఔర్ మే ఉస్ బిచారి కొ కోయ్ దోష్ నహీ దేతా)ను నిందించలేను" అని వ్యాఖ్యానించారు. మళ్లీ కాంగ్రెస్ ను పునరుద్ధరించుకోవాలని అనుకుంటే పార్టీకోసం కష్టపడటం చాలా అవసరమన్నారు.