: మరోసారి విఫలమైన కోహ్లీ
క్వార్టర్ ఫైనల్లో విఫలమైన విరాట్ కోహ్లీ... కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో సైతం విఫలమయ్యాడు. ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ చాలా ఇబ్బందిగా ఆడుతున్నట్టు అనిపించింది. 13 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి జాన్సన్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో, కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులు ఉసూరుమన్నారు. రహానే క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 16.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు. రోహిత్ 27, రహానే ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు.