: శిఖర్ ధావన్ కు లైఫ్


ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో అదృష్టం టీమిండియాకే ఉన్నట్టుంది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్ కు లైఫ్ లభించింది. హాజిల్ వుడ్ వేసిన నాలుగవ ఓవర్ నాలుగో బంతిని శిఖర్ డ్రైవ్ చేయగా... బ్యాట్ ఎడ్జ్ ను తీసుకుని కీపర్, ఫస్ట్ స్లిప్ ల మధ్యగా వెళ్లింది. క్యాచ్ అందుకునేందుకు కీపర్ బ్రాడ్ హాడిన్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈజీగా అందుకోవాల్సిన క్యాచ్ ను బ్రాడ్ డ్రాప్ చేశాడు. దీంతో, ధావన్ కు లైఫ్ లభించింది. అప్పటికి భారత స్కోరు 14 పరుగులు మాత్రమే. ప్రస్తుతం భారత్ స్కోరు 6 ఓవర్లలో 24 పరుగులు. రోహిత్ 11, ధావన్ 10 పరుగులతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News