: విశాఖలో ఈరోజు కూడా డిగ్రీ ప్రశ్నాపత్రం లీక్... జిరాక్స్ కేంద్రాల్లో లభ్యం
విశాఖలో ఈరోజు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన డిగ్రీ ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ మధ్యాహ్నం జరగాల్సిన భౌతికశాస్త్రం ప్రశ్నాపత్రం వాట్స్ యాప్ లో ప్రత్యక్షమైంది. దాంతో రెండు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు ముందే చేరుతున్నాయని తెలిసింది. అంతేగాక ప్రశ్నాపత్రాలు ఎన్ఏడీ కొత్తరోడ్డులోని జిరాక్స్ కేంద్రాల్లో లభ్యమయ్యాయి. పత్రాలను డబ్బులకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ముందుగా నిన్ననే (సోమవారం) ప్రశ్నాపత్రాలు లీక్ అయి కలకలం రేపగా, వీసీ విచారణకు ఆదేశించారు. అయినప్పటికీ నేడు కూడా ప్రశ్నాపత్రాలు ముందుగానే బయటికి రావడం గమనార్హం.