: యెమన్ వ్యతిరేకులపై సౌదీ అరేబియా యుద్ధం


యెమన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన రెబల్స్ పై సౌదీ అరేబియా రాకెట్ లాంచర్లు, యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. సౌదీ అరేబియా తన మిత్ర దేశాల సైన్యంతో కలసి ఈ మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. యెమన్ లో 'హుతి' రాడికల్ కార్యకలాపాలకు అడ్డు పడడమే తమ లక్ష్యమని అమెరికాలో సౌదీ ప్రతినిధి అదెల్ అల్-జుబేర్ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకులు తలదాచుకున్నారన్న సమాచారంతో పలు లక్ష్యాలపై దాడులు చేసినట్టు వివరించారు. ఈ దాడులపై మరిన్ని వివరాలు అందించలేమని తెలిపారు. కాగా, యెమన్ లోని భారతీయులు తక్షణం వెనక్కు వచ్చేయాలని భారత ప్రభుత్వం కోరింది.

  • Loading...

More Telugu News