: వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. పట్టు బిగించే యత్నంలో భారత్


భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్స్ లో ఒక్క పరుగు తేడాతో ఆసీస్ రెండు వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 232 పరుగుల వద్ద 23 పరుగుల చేసిన మ్యాక్స్ వెల్ (14 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) అశ్విన్ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం ఒక్క పరుగు తేడాతో మాంచి ఫామ్ లో ఉన్న ఫించ్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ధావన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫించ్ 116 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 81 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 38.2 ఓవర్లలో 233 పరుగులు.

  • Loading...

More Telugu News