: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ పై గూగుల్ 'ప్రత్యేక డూడుల్' ఆవిష్కరణ
ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఈ రోజు ఆడుతున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ పై సెర్చ్ ఇంజిన్ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రత్యేక డూడుల్ ను ఆవిష్కరించింది. గూగుల్ హోం పేజీపై ఉంచిన ఆ డూడుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా గూగుల్ హోం పేజీల్లో మాత్రమే ఈ డూడుల్ అభిమానులకు కనువిందు చేయనుంది.