: పూర్తి ప్యానెల్ నే పెట్టలేకపోయారు... ఇంకా కామెంట్లు ఎందుకు?: మురళీ మోహన్
రాజేంద్రప్రసాద్ తన ప్యానెల్ ను పూర్తిగా పెట్టలేకపోయారని ఎంపీ మురళీ మోహన్ తెలిపారు. మంచులక్ష్మీ తమ్ముడు అడిగాడని పోటీ పెట్టలేదని చెప్పిన రాజేంద్రప్రసాద్ ను, శివకృష్ణ కుటుంబం నుంచి ఎవరు ఫోన్ చేసి పోటీ పెట్టవద్దని అడిగారని ఆయన ప్రశ్నించారు. తన సొంత డబ్బులతో 'మా'కు ఎంతో సేవ చేశానని ఆయన తెలిపారు. తన నియోజకవర్గంలో సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఎన్నో పనులు చేశానని, అయినప్పటికీ ఓటమిపాలయ్యానని, రెండోసారి మరింత సమర్ధవంతంగా పనులు చేసి విజయం సాధించానని ఆయన వెల్లడించారు. తనకు పదవులు కావాలంటే ఎన్నో ఉన్నాయని, 'మా' అధ్యక్ష పదవే పరమావధి కాదని ఆయన చెప్పారు. 'డబ్బులు ఇచ్చి ఖర్చు చేయండి' అంటే ఎవరైనా ఖర్చుపెడతారని చెప్పిన ఆయన, డబ్బులు సంపాదించడం ఎంతో కష్టం అని తెలిపారు.