: చెల్లాచెదురుగా మృతదేహాలు, విమాన శకలాలు


ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో కుప్పకూలిన జర్మన్ వింగ్స్ విమాన శకలాలు, మృతదేహాలు తీసుకువచ్చేందుకు సహాయకచర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా, సహాయకచర్యలకు కొంతసేపు అంతరాయం కలిగింది. విమానం కూలిన ప్రదేశం పర్వత ప్రాంతం కావడంతో వందల మీటర్లమేర విమాన శకలాలు, మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని సహాయక బృందాలు తెలిపాయి. కాక్ పిట్ వాయిస్ ను స్వాధీనం చేసుకున్న సహాయక బృందాలు దానిని పారిస్ తరలించాయి. సీవీఆర్ చాలావరకు దెబ్బతిందని, అయితే డేటా సేకరించడం కష్టం కాదని ఫ్రాన్స్ అధికార వర్గాలు తెలిపాయి. 38వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న విమానం కేవలం ఎనిమిది నిమిషాల్లో ఆరువేల అడుగుల ఎత్తుకు ఎందుకు పడిపోయింది? అనేది తెలియాల్సి ఉంది. విమానం కిందికి వస్తున్నప్పుడు పొగలు రాలేదని, విస్పోటనం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీవీఆర్ రికార్డర్ లభ్యమైనప్పటికీ, ఫ్లైట్ డేటా రికార్డర్ దొరకలేదని, అది దొరికితే కానీ విమాన ప్రమాదంపై ఓ అంచనాకు రాలేమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగే ముందు పైలట్ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ రాలేదని అధికారులు తెలిపారు. విమానం కూలిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, దానిని అవలాంచి(మంచు తుపాను)గా భావించామని స్థానికులు తెలిపారు. విమానం కూలిన ప్రదేశంలో పర్వతాల ఎత్తు మూడు వేల అడుగులని, అందువల్ల సుశిక్షుతులైన సహాయక బృందాలను రంగంలోకి దించామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News