: ఆల్ఫ్స్ పర్వతాల్లో విమాన ప్రమాదం ఉగ్రదాడి కాకపోవచ్చు: ఫ్రెంచ్ మంత్రి
బార్సిలోనా నుంచి డస్సెల్ డర్ఫ్ కు వెళ్తూ, ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో ఎయిర్ బస్ కూలిన ఘటనలో విమాన సిబ్బందితో పాటు 150 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఫ్రెంచ్ అంతర్గత వ్వవహారాల శాఖ మంత్రి బెర్నాండ్ కాజెనువె స్పందించారు. విమానం కూలడానికి గల కారణాలపై విచారణ చేపట్టామని చెప్పారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ను నిన్ననే స్వాధీనం చేసుకున్నారు.