: రాజేంద్రప్రసాద్ కు షాకిచ్చిన శివాజీరాజా, ఉత్తేజ్... 'మా' ఎన్నికల్లో కీలక మలుపు
ఎంతో ఆసక్తికరంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కీలక మలుపు తిరిగాయి. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రాజేంద్రప్రసాద్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నట్టు శివాజీరాజా, ఉత్తేజ్ ప్రకటించారు. ఈ ప్యానెల్ తరపున ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న శివాజీ రాజా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే, సంయుక్త కార్యదర్శి పోటీ నుంచి ఉత్తేజ్ కూడా తప్పుకున్నారు. దీంతో, రాజేంద్రప్రసాద్ ప్యానల్ బలహీనపడినట్టైంది. మరోవైపు జయసుధ ప్యానల్ బలాన్ని పుంజుకుంది. ఈ నెల 29న మా ఎన్నికలు జరగనున్నాయి. తనకు రాజకీయ నేతల నుంచి ఒత్తిడులు వస్తున్నాయంటూ జయసుధ ప్రకటించిన మరుసటి రోజే... రాజేంద్రప్రసాద్ ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు సభ్యులు తప్పుకోవడం విశేషం.