: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బోణీ... ‘గుంటూరు టీచర్స్’ నుంచి రామకృష్ణ గెలుపు
శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ బోణీ కొట్టింది. ఏపీలో జరిగిన రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల స్థానం నుంచి టీడీపీ బలపరచిన రామకృష్ణ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఆయనకు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఈ స్ధానానికి మొత్తం 13,047 ఓట్లు పోలవగా, 6980 ఓట్లను రామకృష్ణ సాధించారు. దీంతో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులోనే ఆయన విజయం ఖరారైంది. రామకృష్ణ విజయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఏపీలో మరో ఎమ్మెల్సీ, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.