: స్పిన్, సీమ్ అన్న దానితో పనిలేదు... అసీస్ ను ఓడిస్తామంటున్న రోహిత్ శర్మ


వరల్డ్ కప్ లో ఇప్పటిదాకా సాగిస్తున్న జైత్రయాత్రను ఇకపైనా కొనసాగిస్తామని టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్, ఓపెనర్ రోహిత్ శర్మ ప్రకటించాడు. రేపు సిడ్నీలో జరగనున్న సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించి తీరుతామని అతడు చెప్పాడు. ‘‘సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ స్పిన్ కు అనుకూలిస్తుందా? లేక సీమర్లు రాణిస్తారా? అన్న అంశంపై మాకెలాంటి చింత లేదు. ఎందుకంటే, ఎలాంటి పిచ్ పైనైనా రాణించే సత్తా మాకుంది. వరల్డ్ కప్ లో ఇప్పటిదాకా మేం ఆడిన ఏడు మ్యాచ్ లలో 70 వికెట్లు తీశాం. ప్రతిసారీ ప్రత్యర్థిపై పైచేయి సాధించాం. రేపటి మ్యాచ్ లో ఎలా ఆడాలో మాకు తెలుసు. మా సీమర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. అదే సమయంలో మాకు మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునేందుకు మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని అతడు వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News