: ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు
శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు ప్రతి అంశాన్నీ రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వివాదం లేనటువంటి అంశాలను సైతం వివాదం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఇబ్బంది లేకుండా, వారి ఇష్టపూర్వకంగానే రాజధాని కోసం భూములు సమీకరించామని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే రీతిలో సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరిస్తే బాగుంటుందని సూచించారు.