: అసెంబ్లీ ప్రాంగణంలో సస్పెండైన టీ.టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు... వాగ్వివాదం


తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళుతున్న టీడీపీ నేతలను మార్షల్స్, పోలీసులు అడ్డుకున్నారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు వీలులేదని చెప్పడంతో ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం కావాలనే తమను తొక్కి పెడుతోందని ఆరోపించారు. సభలో మంత్రులు మాట్లాడుతున్న తీరు సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఓటు వేస్తేనే తాము కూడా గెలిచామని ఎర్రబెల్లి అన్నారు.

  • Loading...

More Telugu News