: చెల్లి పెళ్లి కన్నా మ్యాచ్ మిన్న... ఆమెకు విజయాన్ని బహుమతిగా పంపుతానంటున్న క్రికెటర్


గ్రాంట్ ఇలియట్... దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయంతో వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో న్యూజిలాండ్ ఫైనల్స్ కు చేరడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. తమకు పోటీగా ఆస్ట్రేలియా వచ్చినా, ఇండియా వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. అందుకోసం సొంత చెల్లెలి వివాహానికి కూడా వెళ్ళడం లేదు. ఇలియట్ చెల్లి వివాహం శుక్రవారం జరగనుంది. ఈ వేడుకకు ఇలియట్ దూరం కానున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్స్ లో సత్తా చాటి తొలి వరల్డ్ కప్ గెలవాలన్న కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇలియట్ నెట్ ప్రాక్టీసుకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణం. "దురదృష్టవశాత్తూ నేను ఆమె పెళ్లిని మిస్ అవుతున్నాను. ఐయామ్ సారీ. ఒక ప్రత్యేక బహుమతిని ఆమెకు నేను ఇస్తానని అనుకుంటున్నాను" అన్నాడు. అంటే, కప్ గెలవడం ద్వారా ఆమెకు విజయాన్ని బహుమతిగా ఇస్తానని అంటున్నాడు ఇలియట్.

  • Loading...

More Telugu News