: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,614 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 5 లక్షల 65వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అరగంట ముందే అనుమతిస్తున్నారు. కాగా పరీక్ష ప్రారంభమయ్యాక గరిష్టంగా 10 నిమిషాల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు తలెత్తితే 040-23230941, 040-23230942 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు.