: ఆంధ్రా- తెలంగాణ మధ్య నలుగుతున్న ఇంజినీర్లు!


ఆంధ్రా ప్రాంతంలో నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో పనిచేసిన ఇంజినీర్లకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి పంపించివేయగా, తెలంగాణ సర్కారు మాకేంటి సంబంధం? అంటోంది. దీంతో ఈ ఉద్యోగులు నిరసనబాట పట్టారు. ఆంధ్రా ప్రాంతంలో పుట్టి, కష్టపడి చదివి, ఏపీపీఎస్ఈ పెట్టిన పరీక్షలకు హాజరై, స్థానికేతరులుగా తెలంగాణలో ఉద్యోగాలు పొంది, తిరిగి ఆంధ్రా ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ వచ్చిన ఉద్యోగులు వీరు. రాష్ట్రం విడిపోయిన తరువాత, మొత్తం 175 మందిని 'మీరు తెలంగాణకు వెళ్ళాలంటూ' ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేయగా, 'ఇంతకాలం అక్కడ పనిచేశారు కాబట్టి మాకు సంబంధం లేద'ని టీ-సర్కారు పోస్టింగ్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. రెండు ప్రభుత్వాలూ సంబంధం లేదంటే తాము ఏమి కావాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గత 5 నెలలుగా వేతనాలు లేవని, తక్షణం సమస్యను పరిష్కరించాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు.

  • Loading...

More Telugu News