: నేడు సింగపూర్ పర్యటనకు చంద్రబాబు... లీకున్ యూ అంత్యక్రియలకు హాజరు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు సింగపూర్ పర్యటనకు బయలుదేరుతున్నారు. సింగపూర్ మాజీ ప్రధాని, ఆ దేశ ఆధునిక నిర్మాత లీకున్ యూ అంత్యక్రియలకు ఆయన హాజరుకానున్నారు. ఇదివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు ఈ నెల 29న సింగపూర్ వెళ్లాల్సి ఉంది. అయితే లీకున్ యూ మరణం నేపథ్యంలో తన పర్యటనను నాలుగు రోజుల ముందుకు చంద్రబాబు మార్చుకున్నారు. లీకున్ యూ అంత్యక్రియలకు హాజరుకావడంతో పాటు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై ఆ దేశ ప్రతినిధులతో చంద్రబాబు తుది సమీక్ష జరపనున్నారు.

  • Loading...

More Telugu News