: బోస్టన్ పేలుళ్ళ రెండో నిందితుడి పట్టివేత


అమెరికాలోని బోస్టన్ నగరంలో పేలుళ్ళకు పాల్పడిన నిందితుల్లో రెండో వ్యక్తిని నేడు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు జోఖార్ సర్నయేవ్ (19) అని పోలీసులు తెలిపారు. కాగా, నిన్న మింట్ కాంపస్ వద్ద జరిగిన కాల్పుల్లో జోఖార్ సోదరుడు తామర్లేన్ సర్నయేవ్ (26) హతమైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ చెచెన్యా జాతీయులు. ఇస్లామిక్ తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైన కారణంగానే వీరిద్దరూ బోస్టన్ మారథాన్ వద్ద విధ్వంసానికి పాల్పడి ఉండవచ్చని అమెరికా భద్రతా వర్గాలు అభిప్రాయపడ్డాయి.

కాగా, నిన్న జరిగిన కాల్పుల ఘటనలో జోఖార్ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారం మేరకు జోఖార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ బోట్ వద్ద రక్తపు మరకలు కనిపించడంతో సందేహించిన ఆ స్థానికుడు సమీపానికి వెళ్ళి పరిశీలించగా.. బోట్లో టార్పాలిన్ కింద గాయాలతో ఓ వ్యక్తి కనిపించాడు. దీంతో, స్థానికుడు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటీన అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడే బోస్టన్ పేలుళ్ళ నిందితుడని వెల్లడైంది.

  • Loading...

More Telugu News