: హైదరాబాదులో దారుణం...ప్రైవేటు పాఠశాల నిర్వాహకురాలిని సజీవదహనం
హైదరాబాదులో మొన్న సీఏ చదువుతున్న పూజిత సజీవదహనం ఘటన రేపిన కలకలం సద్దుమణగకముందే, మరో మహిళను వ్యాపార భాగస్వామి సజీవ దహనం చేసిన ఘటన ఆందోళన రేపుతోంది. బోడుప్పల్ లో ఓ ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్న శ్రీదేవి అనే మహిళను పాఠశాల నిర్వహణలో సహభాగస్వామి సజీవదహనం చేశాడు. దీంతో నిందితుడిని చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.