: డిగ్రీ కూడా పూర్తి చేయని దేవీప్రసాద్ ఎమ్మెల్సీనా?: హైకోర్టులో పిటిషన్
డిగ్రీ కూడా పూర్తి చేయని దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ పదవికి ఎలా అంగీకరించారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలం ప్రశ్నించారు. దీంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపేయాలంటూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా, బ్యాలెట్ పేపర్ లో పార్టీల పేర్లను ఎలా ముద్రిస్తారంటూ ఆయన పిటిషన్ లో ప్రశ్నించారు. బ్యాలెట్ పేపర్ లో పార్టీల పేర్లను పేర్కొవడం, ముద్రించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు.