: రెండో వికెట్ పడగొట్టిన దక్షిణాఫ్రికా... సెంచరీ దాటిన కివీస్ స్కోరు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ 81 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మెక్ కల్లం ఔటవడంతో బ్యాటింగ్ కు వచ్చిన విలియం సన్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. 11 బంతులను ఎదుర్కొన్న విలియంసన్ ఒక్క ఫోరు సాయంతో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మోర్కెల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం రాస్ టేలర్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 11.3 ఓవర్లలో 101 పరుగులు.