: భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ముందు వేద పండితుల మంగళ వాయిద్యాల నడుమ గోదావరి నది నుంచి పుణ్యజలాలను తీర్థం బిందెతో రామయ్య సన్నిధికి తీసుకొచ్చారు. ఉత్సవాలు మొదలైనందుకు సూచికగా ఆలయ సన్నిధిలోని బేడా మండపంలో సీతారాముల ఉత్సవ మూర్తులకు ఉత్సవాంగస్నపనం నిర్వహించారు. ఈ సాయంత్రం తిరువీధి సేవ జరగనుంది. మరోవైపు, ఏపీ శ్రీరామనవమి ఉత్సవాలపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సమీక్షించారు. కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.