: సెమీస్ సమరానికి వరుణుడి బ్రేక్
ఆక్లాండ్ లో కివీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. సఫారీ ఇన్నింగ్స్ లో 38 ఓవర్ల అనంతరం వర్షం పడడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 3 వికెట్లకు 216 పరుగులు చేసింది. డు ప్లెసిస్ 82, కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో సఫారీలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.