: ప్లాట్ ఫాం టికెట్ ధర పెంచారు!
ఇప్పటివరకు రూ.5 గా ఉన్న రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరను పెంచారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 అని రైల్వే శాఖ ప్రకటించింది. పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతుండడంతో రైల్వే శాఖ ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు నిర్ణయం తీసుకుంది. దీంతో, ప్లాట్ ఫాంపై రద్దీని కొద్దిమేర నియంత్రించవచ్చని భావిస్తున్నారు. కాగా, ప్లాట్ ఫాం టికెట్ ధర పెంచుతున్నట్టు రైల్వే శాఖ అన్ని జోన్లకు ఆదేశాలు జారీచేసింది. పెంచిన ధర పేర్కొంటూ కొత్త టికెట్లు ముద్రించనున్నారు. మిగిలి ఉన్న పాత టికెట్లపై కొత్త ధరను ముద్రించి, వినియోగించాలని రైల్వే శాఖ సూచించింది.