: రూ.672 కోట్లకు బ్యాంకులను బురిడీ కొట్టించిన లియోనియా రిసార్ట్స్
రంగారెడ్డి జిల్లాలో వందల కోట్ల రూపాయలకు బ్యాంకులను బురిడీ కొట్టించిన వైనం వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా షామీర్ పేటలోని లియోనియా రిసార్ట్స్ పై బెంగళూరు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. లియోనియా రిసార్ట్స్ భూమి పత్రాలు చూపించి చైర్మన్ చక్రవర్తి రాజు 11 బ్యాంకులను మోసం చేసి, రుణాలు పొందినట్టు సీబీఐ గుర్తించింది. ఒకే భూమి పత్రాలపై లియోనియా రిసార్ట్స్ ఛైర్మన్ చక్రవర్తి రాజు సుమారు 672 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నట్టు సీబీఐ అధికారులు అభియోగం మోపారు. కాగా, చక్రవర్తి రాజు, 11 మంది బ్యాంకుల అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 11 బ్యాంకులకు 30 ఎకరాల రిసార్ట్స్ భూమి చూపించి ఘరానా మోసం చేసింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.