: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో మహిళా వివక్ష?
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో మహిళా ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి టినా హుయాంగ్ మండిపడుతున్నారు. ట్విట్టర్ లో ఇంజనీర్ గా పని చేసిన ఆమె, వివక్ష కారణంగా ప్రమోషన్ ఇవ్వకుండా సంస్థ వేధించిందని పేర్కొంటూ కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. ఐదేళ్లు ట్విట్టర్లో నిబద్ధతతో పని చేసిన తనకు, పదోన్నతిలో అన్యాయం జరిగిందని చెబుతున్నారు. దీనిపై తనకు సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఆమె పేర్కొంటున్నారు. ట్విట్టర్లోని చట్టాలు మహిళలకు అన్యాయం చేసేలా, పురుషులకు మేలు చేసేలా ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగానే ట్విట్టర్లో ఉన్నతోద్యోగాలన్నీ పురుషులతో నిండిపోయాయని ఆమె మండిపడ్డారు. అయితే, ట్విట్టర్ మాత్రం టినా స్వచ్ఛందంగానే ఉద్యోగానికి రాజీనామా చేశారని పేర్కొంది.