: కత్రినా కైఫ్ మిస్సింగ్! అంటూ ట్వీట్లు


సామాజిక అనుసంధాన వేదికల్లో ఈ మధ్య చాలా విషయాలు హాస్యాస్పదమవుతున్నాయి. ప్రధానంగా చాలామంది ట్విట్టర్ వినియోగదార్లు ప్రతి విషయాన్ని పరిహాసంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కత్రినా కైఫ్ మిస్సింగ్ అంటూ కుప్పలుతెప్పలుగా ట్వీట్స్ చేస్తున్నారు. ఒకరు "మొదట రాహుల్ గాంధీ, ఇప్పుడు కత్రినా కైఫ్ మిస్సింగ్. భారత్ కు చాలా మంచిది. మళ్లీ తిరిగి రావొద్దు" అని ట్వీట్ చేశారు. మరొకరు "ఎట్టకేలకు కత్రినా మాయమైంది. అనేక సంవత్సరాల నా కోరిక నిజమైందిప్పుడు" అని, ఇంకొకరు "కత్రినా మిస్సింగ్! వేలమంది కోరిక ఇప్పుడు వాస్తవమైంది" అని ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు. ఇంకొకరైతే కత్రినా మిస్ అవ్వలేదని, తను లండన్ లోని ఐఐఎన్ లో నటనలో శిక్షణ తీసుకుంటోందని వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News