: ముకేష్ అంబానీపై సునీల్ మిట్టల్ 'వైఫై' పోరు!


నానాటికీ పెరుగుతున్న భారత 'వైఫై' మార్కెట్లో తనదైన ముద్ర వేసేందుకు భారతీ ఎయిర్ టెల్ అధినేత సునీల్ మిట్టల్ ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోతో పోటీ పడనున్నారు. ఇందుకోసం వోడాఫోన్ తో చేతులు కలిపి 2014లో ఏర్పాటు చేసిన 'ఫైర్ ఫ్లై నెట్ వర్క్' ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 'వైఫై' నెట్ వర్క్ విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించడంలో చేస్తున్న కసరత్తును తుదిదశకు తీసుకువచ్చింది. ఢిల్లీ లోని ఎన్ డీఎంసీ ప్రాంతంలో అత్యధిక 'వైఫై' వాటాను పొందడమే లక్ష్యంగా 'ఫైర్ ఫ్లై నెట్ వర్క్' ముందుకు సాగుతోంది. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ ఆలోచనలకు చేదోడుగా ఉండాలన్నది 'ఫైర్ ఫ్లై నెట్ వర్క్' అభిమతమని ఎయిర్ టెల్ వర్గాలు వెల్లడించాయి. ఈ సంస్థలో ఎయిర్ టెల్, వోడాఫోన్ లు చెరి సగం వాటాలను కలిగి ఉంటాయని, ఈ సంస్థ స్వతంత్రంగా పనిచేస్తుందని, ప్రస్తుతం సంస్థ 'వైఫై' రంగంలో మౌళిక వసతుల కల్పన, వ్యాపార విధానం, నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చలు సాగిస్తున్నట్టు వివరించారు. వచ్చే రెండు నెలల వ్యవధిలో మరింత స్పష్టత రావచ్చని మరో అధికారి తెలిపారు. 'ఫైర్ ఫ్లై నెట్ వర్క్' సంస్థ ప్రస్తుతం 2,530 మంది ఉద్యోగులతో వోడాఫోన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ సేథియా నేతృత్వంలో సేవలు అందిస్తోంది. మొత్తం రూ. 220 కోట్లతో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్ ప్రాంతాల్లో 2జి, 3జి, 4జి సేవలను వాణిజ్య పరంగా ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News