: టీఆర్ఎస్ సొంత పత్రికలో ఎలాంటి కథనాలు వస్తాయో తెలిసిందే: కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీఆర్ఎస్ వైఖరిపై మండిపడ్డారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంతో ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు వస్తే, ఆ పత్రిక ప్రతులను టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టడం సరికాదన్నారు. అసలు, టీఆర్ఎస్ సొంత పత్రికలో ఎలాంటి వార్తలు వస్తాయో తెలిసిందేనన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలను తగలబెట్టడాన్ని ఆయన ఖండించారు. పత్రికలు, టీవీ చానళ్లపై టీఆర్ఎస్ వైఖరి బాగాలేదని విమర్శించారు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన విద్యాసంస్థలపై టీఆర్ఎస్ కక్ష సాధింపులకు పాల్పడితే తాము సహించబోమని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు తమవేనని ధీమా వ్యక్తం చేశారు.