: టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ జట్టుతో మ్యాచ్ ఆడిన యువ ఎంపీ


ఎంపీ రామ్మోహన్ నాయుడు క్రికెట్ బ్యాట్ పట్టారు. వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన క్రికెట్ మ్యాచ్ ఆడారు. రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కెప్టెన్లుగా మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో యువ ఎంపీ ప్రొఫెషనల్ తరహాలో బ్యాటింగ్ చేయడం విశేషం. డ్రైవ్ లు, పుల్ షాట్లతో అందరినీ అలరించారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచకప్ లో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ సెమీస్ వరకు చేరుకుందని, ఫైనల్ చేరుకుని కప్ తీసుకుని రావాలని ఆశిస్తున్నామని తెలిపారు. టీమిండియాకు తమ మ్యాచ్ ద్వారా విషెస్ చెబుతున్నామని పేర్కొన్నారు. ఇక, క్రికెట్ ఆడడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలమని అన్నారు.

  • Loading...

More Telugu News