: కాలివేళ్లు లేకపోతేనేం, ఖలేజా ఉంది... క్రికెట్టే జీవితంగా ఎదిగిన గప్టిల్


వెస్టిండీస్ తో వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో విశ్వరూపం ప్రదర్శించి డబుల్ సెంచరీ సాధించిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ గురించి ఇప్పటిదాకా ఎక్కువ మందికి తెలియని విషయం ఇది. గప్టిల్ 13వ ఏట ఓ ఫోర్క్ లిఫ్ట్ వాహనం అతని కాలిపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో గప్టిల్ ఎడమకాలి మూడు వేళ్లు తెగిపోయాయి. అయినాగానీ, గప్టిల్ క్రికెట్ నే శ్వాసించి, అందులో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం సామాన్యమైన విషయం కాదు. అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్లే పరిగెత్తేందుకు ఇబ్బందులు పడుతుంటే, కాలివేళ్లు లేకున్నా, మైదానంలో అతడు పరిగెడుతుంటే ఆ లోపం ఉన్నట్టే తెలియదు. గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించింది 2009లో. కానీ, ప్రపంచకప్ లో అత్యధిక స్కోరు 237 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత ఒక్కసారిగా వరల్డ్ క్లాస్ స్టార్ డమ్ కొట్టేశాడు. దీంతో, అందరి దృష్టి ఆకర్షించాడు. అతనికి సంబంధించిన విషయాలపైనా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

  • Loading...

More Telugu News