: సత్య నాదెళ్లకు మాతృ వియోగం.... సంతాపం ప్రకటించిన చంద్రబాబు, సుజనా చౌదరి


మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాతృమూర్తి ప్రభావతి (85) మృతి చెందారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న ఆమె గడచిన రాత్రి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మాదాపూర్ లోని బీహెచ్ఈఎల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ప్రబావతి భర్త బీఎన్ యుగందర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసి పదవీ విమరణ చేసిన సంగతి తెలిసిందే. ప్రభావతి మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News