: ‘అన్నగారి’ నటన అద్భుతం!: 'రుద్రమదేవి' ఆడియో రిలీజ్ లో మంత్రి అయ్యన్న
‘‘రాముడు, కృష్ణుడి పాత్రల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు నటిస్తే, ఆ దేవుళ్లు ఇలా ఉంటారనుకున్నాం. దుర్యోధనుడి పాత్రలోనూ ఆయన జీవించారు. ఏ పాత్రలో నటించినా, ఆ పాత్రకు ఎన్టీఆర్ జీవం పోశారు’’ అని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న రుద్రమదేవి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన ఆయన చిత్రంలోని ఓ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్, తన సొంతూరు నర్సీపట్నంకు చెందినవారన్నారు. భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన రావాలని ఆయన ఆకాంక్షించారు.