: సమృద్ధి వర్షాలు... పచ్చగా పంటలు... పాలకుల మధ్య వైషమ్యాలు: ఉగాది పంచాంగం
మన్మథనామ సంవత్సరంలో తెలుగు ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు వెల్లివిరియనున్నాయని ఉగాది పంచాంగంలో పండితులు పేర్కొన్నారు. ఉగాదిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు వేడుకలను అధికారంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాగ శ్రవణం వినేందుకు రెండు కార్యక్రమాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కొత్త సంవత్సరంలో తెలుగు ప్రజల్లో వెలుగులు నిండడంతో పాటు సకాలంలోనే వర్షాలు సమృద్ధిగా పడతాయని, పంటలు పచ్చగా ఉంటాయని పంచాంగం సెలవిచ్చింది. అయితే పాలకుల మధ్య వైషమ్యాలు మరింత పెరగడంతో పాటు దేశాల మధ్య యుద్ధాలు కూడా తప్పవని అనంతవరంలో పంచాంగ శ్రవణం వినిపించిన పండితులు రాణి నరసింహమూర్తి తెలిపారు.