: గప్టిల్ వీర విహారం... 50 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు 393/6


క్వార్టర్ ఫైనల్ లో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన మార్టిన్ గప్టిల్ (237) 50 ఓవర్ల పాటు క్రీజులో కొనసాగాడు. గప్టిల్ వీర విహారంతో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ ఆరు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. డబుల్ సెంచరీతో పాటు వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో దుమ్మురేపిన గప్టిల్, జట్టుకు భారీ స్కోరు సాధించిపెట్టాడు. గప్టిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా, కివీస్ బ్యాట్స్ మెన్లెవరూ కనీసం అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయారు. మరికొసేపట్లో విండీస్ జట్టు 394 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News