: వరల్డ్ కప్ లో మరో డబుల్ సెంచరీ... 152 బంతుల్లో ‘డబుల్’ సాధించిన గప్టిల్


వరల్డ్ కప్ లో సెంచరీలే కాక డబుల్ సెంచరీల మోత కూడా మోగుతోంది. మొన్నటికి మొన్న విండీస్ సంచలనం క్రిస్ గేల్ వరల్డ్ కప్ లో తొలి డబుల్ సెంచరీ చేయగా, అతడి జట్టుపైనే నేటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. సెంచరీ కోసం 111 బంతులు వాడిన గప్టిల్, ఆ తర్వాతి వంద పరుగులను కేవలం 41 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. సెంచరీ పూర్తైన తర్వాత జూలు విదిల్చిన గప్టిల్ ఫోర్లు, సిక్స్ లతో చెలరేగాడు. 152 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్స్ లతో గప్టిల్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.

  • Loading...

More Telugu News