: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక
ఏపీ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ బరిలో దిగిన టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీడీపీ అభ్యర్థులు తిప్పేస్వామి, వీవీవీ చౌదరి, గుమ్మడి సంధ్యారాణిలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. వారు ఈ నెల 30న శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేస్తారు. వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏపీ అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ ప్రకటించారు.