: లోకేష్ పై ఒట్టేసి చంద్రబాబు చెప్పగలరా?: తలసాని సవాల్
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఈ కారణం వల్లనే బీజేపీకి మద్దతిస్తామంటూ తిరుగుతున్నారని అన్నారు. తనపై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన పిల్లల పెళ్లిళ్లకు డబ్బు ఇచ్చినట్టు లోకేష్ పై ఒట్టు వేసి చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిది మురికి నోరు అని, అతనితో తాను వివాదానికి దిగనని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి కూడా హైదరాబాద్ లో నేతలు కరవయ్యారని తెలిపారు.