: 10 సార్లు ఆడి 7 సార్లు ఓడిపోయాం!... ఈసారి ఏమవుతుందో? భారత అభిమానుల్లో ఆందోళన


ఆస్ట్రేలియా, ఇండియా... ఈ రెండు దేశాల మధ్యా క్రికెట్ పోరు జరుగుతోంది అంటే అభిమానుల్లో అమిత ఆసక్తి నెలకొని ఉంటుంది అనడంలో సందేహం లేదు. పాకిస్థాన్ తరువాత అంతటి భావోద్వేగాలు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లోనే బయటకు వస్తాయి. రెండు దేశాల మధ్యా జరిగిన వన్ డే క్రికెట్ పోటీల్లో ఆస్ట్రేలియాదే పైచేయి. ఈ విషయమే ఎప్పుడూ భారత క్రీడాభిమానుల్లో ఒకింత ఆందోళన కలిగిస్తుంటుంది. ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో ఇంతవరకూ 10 సార్లు భారత్, ఆస్ట్రేలియాలు తలపడగా, కేవలం 3 సార్లు మాత్రమే ఇండియా విజయం సాధించింది. చివరిగా 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో తలపడిన ఇండియా ఘనవిజయం సాధించి అదే ఊపుతో విశ్వ విజేతగా నిలిచింది. ఇది మినహా వరల్డ్ కప్ వరకూ మనకు ఆస్ట్రేలియాపై పెద్దగా విజయాలు లేవు. దీంతో, ఈనెల 26న సిడ్నీ వేదికగా జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి రావడంతో భారత అభిమానుల్లో విజయంపై కాస్తంత ఆందోళన నెలకొంది. సగటు వీరాభిమాని మాత్రం ఇండియా గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు.

  • Loading...

More Telugu News