: ఈసారి కుర్దు యోధుల పీకలు కోశారు!
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు తాజాగా ముగ్గురు కుర్దు యోధుల పీకలు తెగ్గోసిన తాలూకు వీడియోను విడుదల చేసింది. ఉత్తర ఇరాక్ లో ఈ దారుణం జరిగింది. డజన్ల సంఖ్యలతో తమ వద్ద ఇంకా బందీలు ఉన్నారని, వారందరికీ ఇదే గతి పడుతుందని ఆ వీడియోలో మిలిటెంట్లు హెచ్చరించారు. "కుర్దు ప్రజలారా... మా యుద్ధం మీపై కాదని తెలుసుకోండి. ముస్లింలపై యుద్ధాన్ని బలవంతంగా రుద్దుతున్న వారిపైనే మా పోరాటం" అని వీడియోలో కనిపించిన ఓ మిలిటెంట్ తెలిపాడు. మరో మిలిటెంట్ కుర్దు సాయుధ బలగాల నేత మసూద్ బర్జానీని ఉద్దేశించి మాట్లాడుతూ, "నిన్ను ఇంతకుముందే హెచ్చరించాం. ఇస్లామిక్ స్టేట్ రక్షణలో ఉన్న వారిపై దాడులు చేస్తే, మా వద్ద బందీగా ఉన్న మీ వాళ్లలో ఒకరిని నీ స్వహస్తాలతో నువ్వే చంపుకున్నట్టవుతుంది" అని పేర్కొన్నాడు.