: మ్యాటర్ లేకున్నా మార్కులేస్తున్నారు... ప్రైవేట్ విద్యా సంస్థలపై మోహన్ బాబు ఫైర్
ఓ ప్రైవేట్ పాఠశాల చైర్మన్ హోదాలో టాలీవుడ్ అగ్ర నటుడు మోహన్ బాబు ప్రైవేట్ పాఠశాలలపై నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని విద్యా సంస్థల్లో విషయ పరిజ్ఞానం లేని విద్యార్థులకు అత్యధిక మార్కులేస్తున్న ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయంటూ ఆయన విరుచుకుపడ్డారు. మీ పిల్లలను అద్భుతంగా చదివిస్తున్నామని మభ్యపెడుతూ అధిక మొత్తాల్లో డబ్బు గుంజుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ పేరిట మోహన్ బాబు ప్రైవేట్ పాఠశాలను నడుపుతున్న విషయం తెలిసిందే. శ్రీ విద్యానికేతన్ 22వ వార్షికోత్సవం నిన్న పాఠశాల కేంపస్ లో ఘనంగా జరిగింది. వార్షికోత్సవాల్లోనే తన జన్మదినాన్ని కూడా జరుపుకున్న సందర్భంగా మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.